శివసేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తమ నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ పై యుద్ధం చేసేందుకు శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ వంతు సాయంగా నెల వేతనాలు ఇస్తున్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో తామంతా కరోనాను నిరోధించడంలో విజయవంతమవుతామని ఆ పార్టీ నేత సంజయ్ రావత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా క్వారంటైన్ గదులను సిద్దం చేసింది.
శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం