ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ విపత్కర సమయంలోతన వంతు సహాయం చేయాలనుకుంటున్నానని బాలు తెలిపారు . పోలీస్, పారిశుధ్య, వైద్యులకు సహాయం అందిస్తా. నాతోపాటు శ్రోతలకు కూడా అవకాశం ఇస్తున్నా. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను అడగవచ్చు. ఎవరు ముందు అడుగుతారో వారికే అవకాశం ఉంటుంది. వచ్చే శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు మీరు కోరిన పాటలు నేను పాడతా. ఇందుకు సాధారణ రుసుము రూ.100 చెల్లించాలి. ఇలా సేకరించిన మొత్తాన్ని ఎలా వినియోగించాలనే విషయంపై మీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటా. నా అకౌంట్ నెంబర్‌ను నా ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచాను. మొత్తం పాట పాడితే అరగంటలో ఎక్కువ పాటలు రావు. కాబట్టి పల్లవి, ఒక చరణం మాత్రం పాడతా. అందరూ సహకరించాలని కోరుతున్నా` అంటూ బాలు విజ్ఞప్తి చేశారు ఎస్పీ బాలు.
కరోనాపై పోరాటం.. సాయం చేస్తానంటున్న ఎస్పీ బాలు