అమెరికాలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. వివిధ రాష్ట్రాల గవర్నర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలపై శ్వేతసౌధం నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అమెరికా రాష్ట్రాల్లో పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నది. స్టేట్ ఎట్ హోమ్ లాంటి కఠిన ఆంక్షలను ఎత్తివేయాలని కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే వారిని సమర్థిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీన్ని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వ్యతిరేకించారు. దేశాధ్యక్షుడే ఆందోళనకారుల్ని రెచ్చగొట్టడం ఏమిటని వాషింగ్టన్ డెమోక్రటిక్ గవర్నర్ జే ఇన్‌లీ ఆరోపించారు. ఇలా రెచ్చగొట్టడం ప్రమాదకరమని, ఎందుకంటే ప్రాణాలను కాపాడే ఆంక్షలను వారు విస్మరిస్తున్నారని ఆయన అన్నారు.
స్టే ఎట్ హోమ్ నిరసనలు.. ట్రంప్‌పై భగ్గుమంటున్న గవర్నర్లు